రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం, బలిజపల్లి గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తమ పంటను అత్యుత్తమ ధరకే విక్రయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మీ పంటకు సరైన మద్దతు ధర లభిస్తుందని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు. ఇన్ని రోజుల పాటు కష్టపడి చేతికొచ్చిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి..