సిరియాలో జరిగిన విషవాయువు దాడిపై అంతర్జాతీయ రసాయనిక ఆయుధాల నిఘా సంస్థ తాజాగా రిపోర్ట్‌ను వెల్లడించింది. 2017లో అసద్ బాసర్ ప్రభుత్వమే దేశస్థులపై సరిన్, క్లోరిన్ లాంటి రసాయనిక ఆయుధాలతో దాడి చేసినట్లు ఓపీసీడబ్ల్యూ(ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిసన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) పేర్కొన్నది. సిరియాలో కొన్నేళ్లుగా అంత్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఓపీసీడబ్ల్యూ ప్రతినిధులు ప్రత్యక్షంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం బహిర్గతమైంది. సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్ తమ దేశంలో అంతర్యుద్దాన్ని ఆపేందుకు పలుమార్లు స్వదేశీయులపై దాడి చేయించారు. అయితే 2017లో లాట్మనే అనే పట్టణంపై మూడు సార్లు దాడి చేయించారు. దాంట్లో సరిన్, క్లోరిన్ లాంటి ప్రాణాంతక రసాయనిక ఆయుధాలను వాడారు . ఆ దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ వికృత ఘటనలపై తాజాగా హేగ్‌లోని ఓపీసీడబ్ల్యూ సర్వే నిర్వహించింది. రసాయనిక దాడికి అసద్ కారణమంటూ ఆ సంస్థ తేల్చింది.